భూసేకరణ సర్వేను స్పీడప్​ చేయాలి : అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కె.సీతారామారావు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, మార్కండేయ, అచ్చంపేట ఎత్తిపోతల పథకం సాగునీటి ప్రాజెక్టులకు కావలసిన భూసేకరణను స్పీడప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని నాగర్ కర్నూల్ అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కె.సీతారామారావు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని తన చాంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రెవెన్యూ అధికారులతో ప్రాజెక్టుల భూసేకరణ పనులపై రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా కల్వకుర్తి, వెల్దండ, వంగూర్, చారగొండ, తాడూరు, తెల్కపల్లి మండలాల్లో కొనసాగుతున్న 143 ఎకరాల భూసేకరణ సర్వేను వెంటనే పూర్తి చేయాలన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు వెంటనే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో  భూసేకరణ స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిప్యూటీ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరుణ, సత్యనారాయణరెడ్డి, ఈఈలు, డీఈలు, ఆర్డీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.