నాగాలాండ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి, ట్రైబల్ వ్యవహారాల మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ కుటుంబ నియంత్రణపై అవగాహన పెంచుకోవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. జనాభా నియంత్రణ కోసం ఒక చిన్న పరిష్కార మార్గాన్ని కూడా సూచించారు. ‘ఇది చాలా సున్నితమైన విషయం. జనాభా పెరుగుదలను నియంత్రించటం కోసం మనం సరైన మార్గాన్ని ఎంచుకుందాం. లేదా నాలాగే సింగిల్‌గా ఉంటూ.. అందరం కలసి స్థిరమైన భవిష్యత్తు కోసం పాటుపడదాం. ఈ రోజు నుంచే సింగిల్ ఉద్యమంలో పాల్గొనండి’ అని నాగాలాండ్ మంత్రి ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు నాగాలాండ్ మంత్రికి చక్కటి హాస్య చతురత ఉందంటూ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. జులై 11 ప్రపంచ జనాభా దినోత్వం సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు.
గత నెలలోనూ నాగాలాండ్ మంత్రి చిన్నగా ఉండే కళ్లపై కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు చిన్నకళ్లు ఉంటాయని ప్రజలు అంటూ ఉంటారని అన్నారు. తమకు చిన్న కళ్లు ఉన్నమాట వాస్తవమేనని, అయితే, ఆ కంటి చూపు మాత్రం అమోఘంగా ఉంటుందని చెప్పారు. కళ్లు చిన్నగా ఉండడం వల్ల ఉండే ప్రయోజనాలను కూడా వివరించారు. కళ్లు చిన్నగా ఉండడం వల్ల దుమ్ము, ధూళి లోపలికి వెళ్లదని, అలాగే ఏదైనా ఎక్కువసేపు కొనసాగే కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు నిద్రపోయినా ఎవరూ గుర్తించలేరని చెప్పారు. మంత్రి టెమ్జెన్ ఇమ్నా చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురిసింది. ఇదే వీడియోను షేర్ చేసిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ .. టెమ్జెన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈశాన్య ప్రజల తరపున గళం వినిపించినందుకు ధన్యవాదాలని పేర్కొన్నారు.
#NorthEastRegion की आवाज को इसके माध्यम से पहुंचाने के लिए @shubhankrmishra जी को धन्यवाद।
— Temjen Imna Along (@AlongImna) July 9, 2022
आभारी! ?? https://t.co/L1gT19CzvE
