మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవి ఖాయమైంది. నాగబాబును ఏపీ కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు డిసెంబర్ 9న సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం నాగబాబు జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. జనసేన తరపున మంత్రి వర్గంలో త్వరలో భాధ్యతలు తీసుకోనున్నారు నాగబాబు.
ఏపీ అసెంబ్లీ స్థానాల సంఖ్యను బట్టి కేబినెట్ లో 25 మంత్రులకు అవకాశం ఉంది. ప్రస్తుతం కేబినెట్ లో 24 మంది మంత్రులు ఉన్నారు. కూటమి పొత్తులో భాగంగా జనసేనకు నాలుగు, బీజేపీకి ఒక మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ మంత్రి వర్గంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే నాగబాబు పేరును చంద్రబాబు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ALSO READ | ఆర్.కృష్ణయ్యకు మళ్లీ రాజ్యసభ.. ఈసారి బీజేపీ నుంచి కన్ఫామ్
నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్ లోకి తీసుకోనున్నారు. నాగబాబుకు ఏ శాఖ ఇవ్వనున్నారనేదాని త్వరలో క్లారిటీ రానుంది. అయితే నాగబాబుకు టూరిజం లేక..సినిమాటోగ్రఫీ శాఖ దక్కే చాన్స్ ఉందని చర్చ జరుగుతోంది.
రాజ్యసభ అభ్యర్థులు వీళ్లే..
మరో వైపు ఏపీ నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు బీజేపీ నుంచి ఒకరిని టీడీపీ నుంచి ఇద్దరిన్ని ఎంపిక చేసింది కూటమి. బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య ఖరారు కాగా.. టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీష్ పేర్లు ఖరారయ్యాయి. డిసెంబర్ 10న ఈ ముగ్గురు నామినేషన్ వేయనున్నారు.