దేశీయ దిగ్గజ సంస్థ టాటా సన్స్‌కు ఛైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల పాటు కొనసాగించేలా కంపెనీ బోర్డు ఇవాళ (శుక్రవారం) నిర్ణయించింది. సంస్థ బోర్డు సమావేశానికి ప్రత్యేక ఆహ్వానం ద్వారా వచ్చిన రతన్ టాటా.. చంద్రశేఖరన్ సారథ్యంలో టాటా గ్రూప్ పురోగతి, పనితీరుపై తన సంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో ఆయన పదవీకాలాన్ని పొడిగించేందుకు సిఫార్సు చేశారు. బోర్డు సభ్యులు కూడా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పనితీరుపై సానుకూలంగా స్పందించారు.
2017లో నాయకత్వం సంక్షోభం మధ్య బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖరన్..ఐదేళ్ల తన కాలాన్ని సమర్ధంగా నిర్వహించారు. అంతకుముందు చైర్మన్ సైరస్ మిస్త్రీని బోర్డు తొలగించింది. అప్పటి వరకు టీసీఎస్ బాధ్యతలు చూస్తున్న చంద్రశేఖరన్ టాటా గ్రూప్ లో సమర్ధుడైన నాయకుడిగా గుర్తింపు పొందారు. అదే నమ్మకంతో బోర్డు ఆయనకు టాటా సన్స్ చైర్మన్ బాధ్యతలు అప్పగించింది.
ఛైర్మన్‌గా చంద్రశేఖరన్ పదవీ కాలం ఈ నెల 20 తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తున్నట్లు తాజాగా సంస్థ ప్రకటించింది. టాటా-మిస్త్రీ కుటుంబానికి చెందిన వారు కాకుండా ఇంకొక వ్యక్తి టాటా గ్రూపునకు ఛైర్మన్‌గా ఉండటం చంద్రశేఖరన్‌తోనే మొదలైంది. బోర్డు మెంబర్ల మద్దతు నేపథ్యంలో రెండోసారి బాధ్యతలను దక్కించుకున్నారు. గత ఐదేళ్లలో చంద్రశేఖరన్ పదవీకాలంలో స్టీల్, ఏవియేషన్, డిజిటల్ రంగాలలో టాటా గ్రూప్ అనేక విలీనాలతో పాటు కొనుగోళ్ల ద్వారా మెరుగైన వృద్ధిని సాధించింది.
మరిన్ని వార్తల కోసం..
ఈ ఏడాది 40 వేల కుటుంబాలకు దళితబంధు
