కడ్తాల్ మండలంలో వైభవంగా మైసిగండి బ్రహ్మోత్సవాలు

ఆమనగల్లు, వెలుగు : కడ్తాల్  మండలం మైసిగండి మైసమ్మ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి అమ్మవారి రథోత్సవం నిర్వహించగా, భక్తులు రథాన్ని లాగుతూ భక్తి పారవశులయ్యారు. 

ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆలయ ఫౌండర్  ట్రస్టీ శిరోలి, ఈవో స్నేహలత పాల్గొన్నారు.  -