మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టడీపీలో చేరారు. హైదరాబాద్‌లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లిన వసంత కృష్ణప్రసాద్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్‌కు చంద్రబాబు పార్టీ కండువా కప్పి.. సాదరంగా ఆహ్వానించారు.
వసంత కృష్ణ ప్రసాద్‌తో పాటు మైలవరం నియోజకవర్గానికి చెందిన ఒక ఎంపీపీ, ఇద్దరు వైస్ ఎంపీపీలు, 12 మంది సర్పంచ్‌లు, ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు, 7గురు సొసైటీ అధ్యక్షులు, ఇద్దరు మండల పార్టీ అధ్యక్షులు, నలుగురు కౌన్సిలర్లు టీడీపీలో జాయిన్ అయ్యారు.
ఇప్పటికే టీడీపీ తరఫున వసంత కృష్ణప్రసాద్‌కు సీటు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీలో చేరకముందే టీడీపీ అధిష్ఠానం ఆయనకు సీటును ఖరారు చేసింది. టీడీపీలో కృష్ణప్రసాద్ చేరికను.. దేవినేని ఉమా వర్గం వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. కృష్ణప్రసాద్ చేరికను వ్యతిరేకిస్తూ.. ఉమా వర్గం గొల్లపూడిలో అసమ్మతి మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.