ఎన్నికలను బహిష్కరిస్తామంటున్న మైలారం గ్రామస్తులు 

  • లీజు రద్దు చేస్తేనే ఓట్లేస్తాం

అచ్చంపేట, వెలుగు: మైనింగ్​ లీజు రద్దు చేస్తేనే పార్లమెంట్  ఎన్నికల్లో ఓట్లేస్తామని బల్మూర్  మండలం మైలారం గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామ సమీపంలోని గుట్టలో తవ్వకాలకు 2017లో మైనింగ్​ అధికారులు పర్మిషన్​ ఇచ్చారు. గ్రామ పంచాయతీ సభ్యులు, గ్రామస్తుల సమక్షంలో గ్రామసభ నిర్వహించినట్లు ఫోర్జరీ సంతకాలతో తీర్మానం ఇచ్చారని గ్రామస్తులు ఆరోపించారు.

మైనింగ్​ పర్మిషన్​ రద్దు చేస్తేనే పార్లమెంట్​ ఎన్నికల్లో ఓట్లు వేస్తామని గ్రామస్తులు  గ్రామంలో ఫ్లెక్సీలు వేశారు. గ్రామానికి ముప్పు చేసే మైనింగ్​ పర్మిషన్​ను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. శ్రీశైలం, వెకటేశ్వర్లు, విజయ భాస్కర్, సత్యంగౌడ్, నిరంజన్, శ్రీనువాసులు, వెంకటేశ్, వెంకటయ్య, బక్కమ్మ, సైదులు, వెంకటేశ్ గౌడ్, లింగయ్య, కృష్ణా రెడ్డి, రవీందర్​రెడ్డి పాల్గొన్నారు.