కోల్‌కతా: బెంగాల్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ అన్నారు. పార్టీ చీఫ్‌గా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం తన పర్యవేక్షణలోనే జరగాలని అధిష్టానం నిర్ణయించిందన్నారు. బెంగాల్‌లో పోటీ చేయబోయే అభ్యర్థుల లిస్ట్‌ను బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ బుధవారం ఖరారు చేసింది. ప్రధాని మోడీతోపాటు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ సీఈసీలో కమిటీలో మెంబర్లుగా ఉన్నారు. మెజారిటీ సీట్లలో పోటీ చేయబోయే క్యాండిడేట్ల లిస్ట్‌ను ఖరారు చేశామని, త్వరలో ఈ జాబితాను వెల్లడిస్తామని కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో తెలిపారు.
