త్రిపుర: ఢిల్లీతోపాటు పలు సిటీల్లో నిర్మించిన మెట్రో ప్రాజెక్టుల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఈ.శ్రీధరన్ బీజేపీలో చేరారు. మెట్రోమ్యాన్‌గా పేరు గడించిన శ్రీధరన్.. కేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగిస్తుందన్నారు. బీజేపీలో తాను చేరినందున పార్టీపై కేరళ ప్రజలకు పూర్తి విశ్వాసం వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి సంసిద్ధతతో ఉన్నానని.. తనను సీఎంగా ఉండాల్సిందిగా బీజేపీ అధిష్టానం కోరిందన్నారు. తాను పార్టీలో చేరడంతో ప్రజలకు బీజేపీపై నమ్మకం పెరిగిందని, అవి ఓట్లుగా మారుతుయని ఆశాభావం వ్యక్తం చేశారు. కేరళలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం అని పేర్కొన్నారు.
