గద్వాల జిల్లాలో..పిడుగుపాటుతో మూగజీవాలు మృతి

గద్వాల/ కల్వకుర్తి, వెలుగు : జోగులాంబ గద్వాల జిల్లాలో గురువారం సాయంత్రం భారీ వర్షం దంచికొట్టింది. ఉదయం నుంచి మధ్నాహ్నం వరకు ఎండలు ఠారెత్తించగా, ఆ తర్వాత వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు మొదలయ్యాయి. గద్వాల, ధరూరు, గట్టు మల్లకల్ మండలాల్లో సాయంత్రం 5  నుంచి రాత్రి 7 గంటల భారీ వర్షం పడింది.

నాగర్ కర్నూల్​జిల్లా వెల్దండ మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో ధ్యాప అమరేందర్ రెడ్డికి చెందిన ఎద్దు, నెంట శ్రీనుకు చెందిన ఆవు పిడుగుపాటుతో మృతి చెందాయి. మార్కెట్ యార్డు, కల్లాలలో ఆరబోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి.