టేక్మాల్, వెలుగు: వినాయక నవరాత్రి ఉత్సవాలలో పూజలందుకున్న గణపతి లడ్డును వేలం పాటలో ఓ ముస్లిం యువకుడు దక్కించుకున్నాడు. టేక్మాల్ మండలం గొల్లగూడెం గ్రామంలో ప్రతిష్టించిన వినాయకుడి చేతిలోని లడ్డును నిమజ్జనం సందర్భంగా మంగళవారం రాత్రి వేలం వేశారు.
చాలా మంది పోటీ పడటంతో వేలం పాట హోరా హోరీగా సాగింది. చివరకు టేక్మాల్ కు చెందిన ముస్లిం యువకుడు మతిన్ వేలంలో లడ్డూను రూ.60 వేలకు సొంతం చేసుకున్నాడు. గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు మతిన్ను శాలువాతో సన్మానించి లడ్డును అందజేశారు