హిందూ మ‌తానికి చెందిన అక్కా ,చెల్లెలి పెళ్లి : ల‌క్ష‌లాది హృద‌యాల్ని గెలుచుకున్న ప‌ఠాన్ మామ

హిందూ మ‌తానికి చెందిన అక్కా ,చెల్లెలి పెళ్లి : ల‌క్ష‌లాది హృద‌యాల్ని గెలుచుకున్న ప‌ఠాన్ మామ

భారతదేశం మప సామరస్యానికి మారుపేర‌ని మ‌రోసారి రుజువైంది. మ‌హ‌రాష్ట్ర అహ్మ‌ద్ న‌గ‌ర్ కు చెందిన బాబా భాయ్ ప‌ఠాన్ త‌న సొంత ఖ‌ర్చుతో హిందూ మ‌తానికి చెందిన అక్కా చెల్లెలి వివాహాల్ని హిందూ సాంప్ర‌దాయ‌ప‌ద్ద‌తిలో ఘ‌నంగా జ‌రిపారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ‌

అహ్మద్‌నగర్‌కు చెందిన మ‌హిళ స‌వితకు గౌరీ, సౌరీ ఇద్ద‌రు కుమార్తెలు. స‌విత త‌న భ‌ర్త‌ను కోల్పోయిన ప‌నిచేసుకుంటూ త‌న ఇద్ద‌రు కుమార్తెల‌ను పెంచి పెద్ద చేసింది. అయితే భ‌ర్త‌ను కోల్పోయిన ఒంటరైన‌ జీవిస్తున్న స‌విత కుటుంబానికి ప‌ఠాన్ అన్న‌గా పెద్ద‌దిక్కుగా మారాడు. ప్ర‌తీ సంవ‌త్స‌రం స‌విత కు రాఖీ క‌ట్టి ర‌క్ష‌ణ‌గా నిలిచాడు.

అంతేకాదు తాజాగా ప‌ఠాన్ మేన‌మామ హోదాలో గౌరీ, సౌరీల‌కు సొంత ఖ‌ర్చుతో హిందూ సాంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో వివాహం జ‌రిపించాడు. ప్ర‌స్తుతం ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో చ‌క్కెర్లు కొడుతున్నాయి.