Twitter Musk: ట్విటర్ యూజర్లపై మరో భారం

Twitter  Musk: ట్విటర్ యూజర్లపై మరో భారం

సీఈఓగా ఎలన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు ట్విట్టర్ యూజర్లకు భారంగా మారుతున్నాయి. తాజాగా ఆదాయం కోసం యూజర్లపై మరో భారం మోపేందుకు మస్క్ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే ట్విటర్ బ్లూ బ్యాడ్జ్ వెరిఫికేషన్ కోసం యూజర్ల నుంచి నెలకు 8 డాలర్లు, యాపిల్ యూజర్ల నుంచి 11 డాలర్లు వసూలు చేస్తున్నాడు. ఇప్పుడు బిజినెస్ యూజర్ల నుంచి అదనంగా వసూలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇదే అమలైతే బిజినెస్ యూజర్లు.. ట్విట్టర్ గోల్డ్ కలర్ బ్యాడ్జ్ కోసం నెలకు 1000 డాలర్లు కట్టాల్సి ఉంటుంది. బిజినెస్ యూజర్ల అనుబంధ ఖాతాకు మరో 50 డాలర్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాన్ని మెయిల్స్ ద్వారా బిజినెస్ యూజర్లకు మెసేజ్ పంపుతున్నాడు. గోల్డ్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న యూజర్ల ట్వీట్లు ఎక్కువమందికి చేరేలా బూస్టింగ్ సర్వీస్ ను అదనంగా అందిచనున్నారు.