వినాయక నిమజ్జనం చేస్తుండగా.. క్రేన్‌‌‌‌‌‌‌‌ కిందపడి మున్సిపల్‌‌‌‌‌‌‌‌ వర్కర్‌‌‌‌‌‌‌‌ మృతి

  • నిమజ్జనాన్ని బహిష్కరించిన వర్కర్లు
  • కాగజ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో ఘటన
  • డెడ్‌‌‌‌‌‌‌‌బాడీతో మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ ముందు ధర్నా

కాగజ్‌‌‌‌‌‌‌‌నగర్, వెలుగు : వినాయక నిమజ్జనం చేస్తుండగా క్రేన్‌‌‌‌‌‌‌‌ కింద పడి ఓ మున్సిపల్‌‌‌‌‌‌‌‌ కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ వర్కర్‌‌‌‌‌‌‌‌ చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా కాగజ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ పట్టణంలో మంగళవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని పెద్దవాగు వద్ద క్రేన్‌‌‌‌‌‌‌‌ సహాయంతో వినాయక నిమజ్జనాలను చేస్తున్నారు. ఈ టైంలో అక్కడ పనిచేస్తున్న మున్సిపల్‌‌‌‌‌‌‌‌ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ కార్మికులు నగేశ్ (50), ప్రేమ్‌‌‌‌‌‌‌‌ మీదకు క్రేన్‌‌‌‌‌‌‌‌ ఎక్కింది. టైరు కింద పడిన నగేశ్‌‌‌‌‌‌‌‌కు తీవ్ర గాయాలు కాగా, ప్రేమ్‌‌‌‌‌‌‌‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

 గమనించిన తోటి కార్మికులు, మున్సిపల్‌‌‌‌‌‌‌‌, రెవెన్యూ ఆఫీసర్లు ఇద్దరిని పట్టణంలోని ఓ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. నగేశ్‌‌‌‌‌‌‌‌ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. ఈ విషయం తెలిసిన వెంటనే నిమజ్జనం పనుల్లో ఉన్న మున్సిపల్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది విధులను బహిష్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోకపోవడంతో గజఈతగాళ్లు, స్థానికులతో సాయంతో నిమజ్జనం పూర్తి చేశారు. ఘటన విషయం తెలుసుకున్న సబ్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ శ్రద్ధా శుక్లా, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌‌‌‌‌‌‌‌బాబు ఘటనాస్థలాన్ని సందర్శించారు. పోలీసులు క్రేన్‌‌‌‌‌‌‌‌ను స్టేషన్‌‌‌‌‌‌‌‌కు తరలించి, డ్రైవర్‌‌‌‌‌‌‌‌ను అదుపులోకి తీసుకున్నారు. కార్మికుడి మృతి పట్ల బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌. ప్రవీణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అసెంబ్లీ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి రావి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ విచారం వ్యక్తం చేశారు. 

డెడ్‌‌‌‌‌‌‌‌బాడీతో ఆందోళన

క్రేన్‌‌‌‌‌‌‌‌ కిందపడిన చనిపోయిన కార్మికుడు నగేశ్‌‌‌‌‌‌‌‌ డెడ్‌‌‌‌‌‌‌‌బాడీతో కుటుంబ సభ్యులు, బంధువులు, కార్మికులు మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ ఎదుట ఆందోళనకు దిగారు. వీరికి సీఐటీయు లీడర్లు, కార్మికులు, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నేత ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌.ప్రవీణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ మద్దతు తెలిపారు. మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగానే కార్మికుడు చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్, అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ రావాలని పట్టుబట్టారు. 

మృతుడి ఫ్యామిలీకి రూ. 50 లక్షల ఎక్స్‌‌‌‌‌‌‌‌గ్రేషియాతో పాటు ఉద్యోగం, ఇల్లు ఇవ్వాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. తెలుసుకున్న అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ దీపక్‌‌‌‌‌‌‌‌ తివారి, సబ్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ శ్రద్ధా శుక్లా మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌కు వచ్చారు. ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అసెంబ్లీ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి రావి శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ దస్తగిరి వచ్చి మృతుడి కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. అప్పటికప్పుడు రూ. 5 లక్షల చెక్కు ఇవ్వడంతో పాటు, ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌ రూ. 15 లక్షలు, డబుల్‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌రూం ఇల్లు, మృతుడి భార్యకు ఉద్యోగం ఇచ్చేందుకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 

ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద పడి యువకుడు...

ఎల్లారెడ్డిపేట, వెలుగు : గణపతి నిమజ్జనం చేస్తుండగా ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ కింద పడి ఓ యువకుడు చనిపోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన నాలకొండ రాకేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి (18) బుధవారం గణేశ్‌‌‌‌‌‌‌‌ నిమజ్జనంలో పాల్గొన్నాడు. ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ ముందుకు కదులుతుండగా పక్కనే ఉన్న రాకేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ టైర్‌‌‌‌‌‌‌‌ కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డిన అతడిని స్థానికులు ఎల్లారెడ్డిపేట హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించగా ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటూ చనిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.