చౌటుప్పల్, వెలుగు : చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని గ్రీన్ బకెట్ రెస్టారెంట్లో శుక్రవారం మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రెస్టారెంట్లో కుల్లిపోయిన చికెన్ ఉపయోగిస్తున్నట్లు ఆఫీసర్లు తెలిపారు. దాంతోపాటు పాడైన చికెన్ ను డ్రైనేజీలో పారబోస్తున్నందుకు,
రెస్టారెంట్ పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉన్నందున రూ.5వేలు ఫైన్ విధించినట్లు చెప్పారు. ఇలాంటి ఘటన మరోసారి పునరావృతమైతే రెస్టారెంట్ ను సీజ్ చేస్తామని హెచ్చరించారు. తనిఖీల్లో చౌటుప్పల్ మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, జవాస్, అంజయ్య, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
