ఫోన్  ట్యాపింగ్ పై దర్యాప్తు చేయాలని ఎస్పీకి వినతి

పాలమూరు, వెలుగు : గత అసెంబ్లీ ఎన్నికల కంటే కొన్ని నెలల ముందు నుంచి మాజీ మంత్రి ఆదేశాలతో జిల్లా కేంద్రంలోని కొంత మంది ఫోన్లు ట్యాపింగ్  అయ్యాయని, దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని మున్సిపల్  కౌన్సిలర్  బురుజు రాజేందర్ రెడ్డి బుధవారం ఎస్పీ హర్షవర్ధన్ కు వినతిపత్రం అందజేశారు. ఫోన్  కాల్స్  ట్యాప్  చేసి ఎవరితో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకొని

వెంటనే వన్  టౌన్​ పోలీస్​స్టేషన్​కు పిలిపించి బెదిరించేవాళ్లని ఆరోపించారు. వినకుంటే తప్పుడు కేసులు పెట్టించే వారన్నారు. ఇదంతా సీఐ రాజేశ్వర్ గౌడ్  ఆధ్వర్యంలో జరిగిందన్నారు. వెంటనే ఫోన్  ట్యాపింగ్ పై దర్యాప్తు జరిపించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మీడియా సెల్  కన్వీనర్  సీజే బెనహర్  ఉన్నారు.