ముంబై అమ్మాయిలకే ట్రోఫీ.. రూ. 80 లక్షల ప్రైజ్‌‌మనీ సొంతం

ముంబై: బీసీసీఐ సీనియర్ విమెన్స్‌‌ టీ20 ట్రోఫీలో ముంబై జట్టు వరుసగా రెండోసారి విజేతగా నిలిచింది. మంగళవారం వాంఖడే స్టేడియంలోజరిగిన ఫైనల్లో ఆల్‌‌రౌండ్‌‌ షోతో అదరగొట్టిన ముంబై అమ్మాయిలు 10 వికెట్ల తేడాతో బెంగాల్‌‌ జట్టును చిత్తుగా ఓడించారు. 

ఈ వన్‌‌సైడ్‌‌ మ్యాచ్‌‌లో తొలుత బెంగాల్‌‌ 20 ఓవర్లలో 85 రన్స్‌‌కే ఆలౌటైంది. ఓపెనర్‌‌‌‌ ధార గుజ్జార్ (26) టాప్ స్కోరర్‌‌‌‌. ముంబై బౌలర్లలో జాగ్రవి పవార్ మూడు, సౌమ్య సింగ్‌‌ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్‌‌లో ముంబై 12.3 ఓవర్లలో ఒక్క వికెట్‌‌ కూడా కోల్పోకుండా 86 రన్స్‌‌ చేసి ఈజీగా గెలిచింది. ఓపెనర్లు వృశాలి భగత్ (45 నాటౌట్‌‌), హుమైరా కాజి (41నాటౌట్‌‌) సత్తా చాటారు. ట్రోఫీని నెగ్గిన జట్టుకు బీసీసీఐ ఇచ్చే రూ. 40 లక్షల ప్రైజ్‌‌మనీకి అదనంగా  ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌‌ అజింక్యా నాయక్‌‌ మరో రూ. 40 లక్షల నగదు ప్రకటించారు.