ఇరానీ ట్రోఫీలో భాగంగా ముంబై జట్టును ముంబై క్రికెట్ అసోసియేషన్ మంగళవారం(సెప్టెంబర్ 24) ప్రకటించింది. రంజీ ట్రోఫీలో ముంబైకి కెప్టెన్సీ చేసిన టీమిండియా సీనియర్ ప్లేయర్ అజింక్య రహానేకు కెప్టెన్సీ అప్పగించారు. శస్త్ర చికిత్స తర్వాత చాలా నెలల తర్వాత శార్దూల్ ఠాకూర్ ఈ మ్యాచ్ ఆడనున్నాడు. శ్రేయాస్ అయ్యర్, ముషీర్ ఖాన్, షామ్స్ ములానీ, తనుష్ కొటియన్, పృథ్వి షా లాంటి స్టార్ ప్లేయర్లతో ముంబై స్క్వాడ్ పటిష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం భారత జట్టు స్క్వాడ్ లో ఉన్న సర్ఫరాజ్ ఇరానీ కప్ కోసం కాన్పూర్ నుండి లక్నోకు వెళ్లే అవకాశముంది.
లక్నో వేదికగా భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో అక్టోబర్ 1 నుంచి 5 వరకు జరుగుతుంది. రంజీ ట్రోఫీ విన్నర్ ముంబైతో ఈ మ్యాచ్ లో రెస్టాఫ్ ఇండియా తలబడుతుంది. మరోవైపు రంజీ చాంపియన్స్ ముంబైతో లక్నోలో జరిగే ఇరాన్ కప్ మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యాడు. ఈ టీమ్‌లో ఆంధ్ర క్రికెటర్ రికీ భుయ్‌కు చోటు దక్కింది. కాగా, టీమిండియా నుంచి రిలీజ్ అయితే సర్ఫరాజ్ తన హోమ్ టీమ్ ముంబైకి, జురెల్, దయాల్ రెస్ట్ టీమ్‌కు ఆడతారని బీసీసీఐ తెలిపింది.
ALSO READ | ENG v PAK 2024: ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్..పాక్ జట్టులో 37 ఏళ్ళ స్పిన్నర్‌కు చోటు
ఇరానీ ట్రోఫీని చివరి మూడు సార్లు రెస్టాఫ్ ఇండియానే గెలిచింది. ముంబై చివరిసారిగా 1998 లో ఇరానీ కప్ ను అందుకుంది. ఈ సారి స్టార్ ప్లేయర్లు అందరూ అందుబాటులో ఉండడంతో ముంబై టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇరానీ కప్ మ్యాచ్ కు ముంబై జట్టు:
అజింక్యా రహానే, పృథ్వీ షా , ఆయుష్ మ్హత్రే, ముషీర్ ఖాన్, శ్రేయాస్ అయ్యర్, సిద్ధేష్ లాడ్, సూర్యాంశ్ షెడ్గే, హార్దిక్ తమోర్ (వికెట్ కీపర్) సిధాంత్ అద్ధత్రావ్, షమ్స్ ములానీ, తనుష్ కోటియన్, హిమాన్షు సింగ్, శార్దూల్ ఠాకూర్, మొహిత్ అ. జునేద్ ఖాన్, రాయ్స్టన్ డయాస్
Mumbai gears up for Irani Cup 2024-25 with a power-packed squad! ?? pic.twitter.com/jx9MiJMxRX
— CricketGully (@thecricketgully) September 25, 2024