ముంబై ఎస్బీఐ బ్యాంకులో కాల్పులు కలకలం సృష్టించాయి. బ్యాంకులోకి ముఖానికి ముసుగులు ధరించిన ఇద్దరు దొంగలు చొరబడ్డారు. బ్యాంకులో ఉన్న ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిపై కాల్పులు జరపడంతో అతడు అక్కడిక్కకడే మృతి చెందాడు. మిగతా ఉద్యోగులను బెదిరించి రూ.2.5 లక్షలు దోచుకెళ్లారు. ఈ ఘటన ముంబైలోని దహిసర్ వెస్ట్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో జరిగింది. బుధవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో ఇద్దరు ముసుగు దొంగలు బ్యాంకులోకి వచ్చారని బ్యాంకు ఉద్యోగుల్లో ఒకరు తెలిపారు.అయితే ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుల్ని ముంబై పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు దొంగల్ని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దొంగలించిన నగదుతో పాటు.. వెపన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు.
బ్యాంక్ లో క్యాష్ కౌంటర్‌లో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సందేశ్ గోమరే వద్దకు వెళ్లి అతడి ఛాతీపై గన్ పెట్టి కాల్పులు జరిపినట్లు, ప్రత్యేక్ష సాక్షి తెలిపారు. అనంతరం బ్యాంకు మొత్తం తిరుగుతూ ఉద్యోగులను బెదిరించారని పేర్కొన్నారు. అనంతరం రూ.2.5 లక్షలు దోచుకెళ్లారని వివరించారు. ఈ దృశ్యాలన్నీ బ్యాంకు సీసీటీవీలో రికార్డు అయినట్లు తెలిపారు ప్రత్యేక్ష సాక్షి తెలిపారు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటన స్థలికి చేరుకొని పరిశీలించారు. దొంగల కాల్పుల్లో మృతి చెందిన సందేశ్ గోమరే బాడీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని సీసీ ఫుటేజ్ పరిశీలించారు. దొంగల వయసు 25 నుంచి 30 మధ్య ఉండే అవకాశం ఉందని వారి కదలికలను బట్టి గుర్తించారు పోలీసులు. మొత్తం 8 టీమ్స్ గా ఏర్పడిన పోలీసులు.. దొంగల కోసం గాలింపు చేపట్టి వారిని పట్టుకున్నారు.
Mumbai | One SBI contract employee died after being shot by 2 unknown persons at bank's Dahisar branch. One of them opened fire at the employee. They collected about Rs 2.5 lakhs from cashier, & fled; 8 teams placed for search: Pravind Padwal, Additional CP, North Region (29.12) pic.twitter.com/83jBYJjNPB
— ANI (@ANI) December 29, 2021
ఇవి కూడా చదవండి
దేశంలో క్రమంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
న్యూ ఇయర్ వేడుకలు, నుమాయిష్కు పర్మిషన్ ఎట్లిస్తరు?
