రెండో రోజు ఐపీఎల్ వేలంలో విదేశీ ఆటగాళ్లకు కాసుల పంట పండుతోంది. గత వేలంలో కంటే రెట్టింపు రేటు పలుకుతోంది. టిమ్ డేవిడ్ ను ముంబై ఇండియన్స్ రూ.8.25 కోట్లకు సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఈ సారి భారీ ధర పలికాడు. ముంబై ఇండియన్స్ అతడిని రూ. 8 కోట్లకు కొనుగోలుచేసింది. వెస్టిండీస్ ఆల్ రౌండర్ రొమారియో షెపర్డ్ ని రూ. 7.75 కోట్లకుసన్ రైజర్స్ దక్కించుకుంది.
వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఓడియన్ స్మిత్, సౌతాఫ్రికన్ యంగ్ పేసర్ మార్కన్ జాన్సెన్ కూడా మంచి ధర పలికారు. ఓడియన్ స్మిత్ ను రూ.6 కోట్లకు పంజాబ్ కింగ్స్, జాన్సెన్ ను రూ.4.2 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుక్కున్నాయి. శ్రీలంక పేసర్ దుష్మంత చమీరా రూ.2 కోట్లకు లక్నో టీమ్ దక్కించుకుంది. భారత యంగ్ ప్లేయర్ ఖలీల్ అహ్మద్, శివం దూబే కూడా మంచి ధరే పలికారు. ఖలీల్ ను రూ.5.25 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్, దూబేను రూ.4 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకున్నాయి. చేతన్ సకారియాను రూ. 4.20 కోట్లకు ఢగిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. అండర్ 19 కెప్టెన్ యశ్ ధుల్ ను రూ.50 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.
Base Price: INR 40 Lac
— IndianPremierLeague (@IPL) February 13, 2022
Sold For: INR 8.25 Crore @mipaltan bring Tim David on board in some style! ? ?#TATAIPLAuction @TataCompanies pic.twitter.com/F1p13yAWq7
