IPL Retention 2025: బుమ్రా టాప్.. ముంబైతోనే రోహిత్: ముంబై ఇండియన్స్ రిటైన్ ప్లేయర్స్ వీరే

ఐపీఎల్ 2025 కు సంబంధించి ముంబై రిటైన్ చేసుకునే ఆటగాళ్ల లిస్ట్ వచ్చేసింది. అందరూ ఊహించనట్టుగానే స్టార్ ఆటగాళ్లందరూ ముంబై ఇండియన్స్ తోనే ఉన్నారు. బుమ్రాకు రూ. 18 కోట్లు, హార్దిక్ పాండ్యకు రూ.16.35 కోట్లు, సూర్య కుమార్ యాదవ్ కు రూ.16.35 కోట్లు, రోహిత్ శర్మ రూ. 16 కోట్లు.. తిలక్ వర్మ కు రూ. 8 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. కెప్టెన్ ఎవరనే విషయం ఇంకా చెప్పలేదు.  

ముఖ్యంగా కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ జట్టుకు 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మ ఆ జట్టుతోనే కొనసాగడంతో రోహిత్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ముంబై ఇండియన్స్ కు రోహిత్ ఆడడనే వార్తలు గత కొంతకాలంగా బాగా వైరల్ అయ్యాయి. తాజా సమాచార ప్రకారం ఇందులో నిజం లేనట్టు తెలుస్తుంది. యువ ప్లేయర్ ఇషాన్ కిషాన్ కు,ఆస్ట్రేలియా పవర్ హిట్టర్ టిం డేవిడ్ కు ఈ సారి నిరాశ తప్పలేదు.