IPL Retention 2025: ఆ నలుగురూ ముంబైతోనే.. ఐపీఎల్ 2025కు అంబానీ సైన్యమిదే

ఐపీఎల్ 2025 కు సంబంధించి రిటైన్ చేసుకునే ప్లేయర్లను రేపటి లోపు ప్రకటించాలి. అక్టోబర్ 31 ఫ్రాంచైజీలు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే చివరి తేదీ. 2025 ఐపీఎల్ కోసం మెగా ఆక్షన్ జరగనుండడంతో ఎవర్ని రిటైన్ చేసుకోవాలో అనే విషయంపై ముంబై క్లారిటీకి వచ్చింది. వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం స్టార్ ఆటగాళ్లందరూ ముంబై ఇండియన్స్ తోనే ఉండనున్నట్టు సమాచారం. ముఖ్యంగా కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ జట్టుకు 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మ ఆ జట్టుతోనే దాదాపుగా కొనసాగడం ఖాయంగా కనిపిస్తుంది. 

ముంబై ఇండియన్స్ కు రోహిత్ ఆడడనే వార్తలు గత కొంతకాలంగా బాగా వైరల్ అయ్యాయి. తాజా సమాచార ప్రకారం ఇందులో నిజం లేనట్టు తెలుస్తుంది. రోహిత్ తో పాటు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలను కూడా రిటైన్ చేసుకోనున్నారు. యువ ప్లేయర్ ఇషాన్ కిషాన్ కు ఈ సారి నిరాశ తప్పలే కనిపించడం లేదు. ఆస్ట్రేలియా పవర్ హిట్టర్ టిం డేవిడ్ విషయంలో వెనక్కి తగ్గినట్టు కనిపిస్తుంది. అతనితో పాటు నెహ్యాల్ వధేరా, ఆకాష్ మద్వల్ ను వీరిద్దరినీ ఆక్షన్ లో వదిలేసి RTM కార్డు ద్వారా తీసుకోనున్నారని టాక్. 

ALSO READ | IPL Retention 2025: రస్సెల్‌కు కోల్‌కతా బిగ్ షాక్.. అయ్యర్, స్టార్క్‌లకు తప్పని నిరాశ

రోహిత్ కు రూ. 18 కోట్లు, బుమ్రాకు రూ. 18 కోట్లు, హార్దిక్ పాండ్యకు రూ.16 కోట్లు, సూర్య కుమార్ యాదవ్ కు రూ.14 కోట్లు చెల్లించనున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. రిటైన్ రూల్స్ ప్రకారం తొలి రిటైన్ ప్లేయర్ కు రూ. 18 కోట్లు చెల్లించాల్సి ఉంది. రెండు, మూడు రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు ఇవ్వాల్సి ఉంది. నాలుగు ఐదు రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ. 14 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రకారం స్టార్ ఆటగాళ్లను ముంబై వదులుకునే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తం రూ. 120 కోట్ల పర్స్ లో రూ. 66 కోట్లు ఈ స్టార్ ప్లేయర్లకే ఖర్చు పెట్టనుంది.