ఐపీఎల్ 2025 కు సంబంధించి రిటైన్ చేసుకునే ప్లేయర్ల సమయం దగ్గర పడుతుంది. అక్టోబర్ 31 ఫ్రాంచైజీలు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే చివరి తేదీ. 2025 ఐపీఎల్ కోసం మెగా ఆక్షన్ జరగనుండడంతో ఎవర్ని రిటైన్ చేసుకోవాలో అనే విషయంపై ముంబై ఇండియన్స్ బిజీగా ఉంది. వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం స్టార్ ఆటగాళ్లందరూ ముంబై ఇండియన్స్ తోనే ఉండనున్నట్టు సమాచారం. ముఖ్యంగా కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ జట్టుకు 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మ ఆ జట్టుతోనే దాదాపుగా కొనసాగడం ఖాయంగా కనిపిస్తుంది.
ముంబై ఇండియన్స్ కు రోహిత్ ఆడడనే వార్తలు గత కొంతకాలంగా బాగా వైరల్ అయ్యాయి. తాజా సమాచార ప్రకారం ఇందులో నిజం లేనట్టు తెలుస్తుంది. రోహిత్ తో పాటు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలను కూడా రిటైన్ చేసుకోనున్నారు. యువ ప్లేయర్ ఇషాన్ కిషాన్ పై మరోసారి నమ్మకం ఉంచుతారో లేదో చూడాలి. అయితే ఆస్ట్రేలియా పవర్ హిట్టర్ టిం డేవిడ్ విషయంలో వెనక్కి తగ్గినట్టు కనిపిస్తుంది. అతనితో పాటు నెహ్యాల్ వధేరా, ఆకాష్ మద్వల్ ను వీరిద్దరినీ ఆక్షన్ లో వదిలేసి RTM కార్డు ద్వారా తీసుకోనున్నారని టాక్.
Also Read : నిప్పులు చెరుగుతున్న కివీస్ పేసర్లు
నిజం చెప్పాలంటే 2025 ఐపీఎల్ ఆక్షన్ రూల్ ముంబై ఇండియన్స్ కు బాగా కలిసొచ్చింది. అన్ని జట్లతో పోలిస్తే రిటైన్ రూల్ ముంబై శిబిరంలో ఆనందం కలిగిస్తుంది. మొదటి రిటైన్ ప్లేయర్ గా కెప్టెన్ హార్దిక్ పాండ్య.. రెండో రిటైన్ ఆటగాడిగా సూర్య కుమార్ యాదవ్.. మూడో రిటైన్ ప్లేయర్ గా ఇషాన్ కిషన్ తీసుకోనుంది. నాలుగో రిటైన్ ప్లేయర్ గా రోహిత్ శర్మను ఐదో రిటైన్ ఆటగాడిగా బుమ్రాను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రిటైన్ రూల్స్ ప్రకారం తొలి రిటైన్ ప్లేయర్ కు రూ. 18 కోట్లు చెల్లించాల్సి ఉంది. రెండు, మూడు రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు ఇవ్వాల్సి ఉంది. నాలుగు ఐదు రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ. 14 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రకారం స్టార్ ఆటగాళ్లను ముంబై వదులుకునే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తం రూ. 120 కోట్ల పర్స్ లో రూ. 75 కోట్లు ఈ స్టార్ ప్లేయర్లకే ఖర్చు పెట్టనుంది.
MUMBAI INDIANS IS LIKELY TO RETAIN ROHIT SHARMA...!!! ?
— Johns. (@CricCrazyJohns) October 17, 2024
MI is set to retain Rohit, Hardik, Surya & Bumrah for IPL 2025. [Devendra Pandey from Express Sports] pic.twitter.com/4UKLcmMnVn