SMAT 2024: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ.. ఫైనల్లో పడిదార్‌కు భయపడ్డ ముంబై

మధ్య ప్రదేశ్ ఆటగాడు రజత్ పటిదార్ స్పిన్ ఎంత బాగా ఆడతాడనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతటి స్టార్ స్పిన్నర్ ను అయినా అలవోకగా ఆడేయడం ఇప్పటికే ఐపీఎల్ లో చూశాం. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో పడిదార్‌ కు ముంబై బిగ్ స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. ఆదివారం (డిసెంబర్ 15) ముంబైపై జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పటిదార్ క్రీజ్ లోకి వచ్చిన తర్వాత ముంబై ఒక్క స్పిన్నర్ చేత బౌలింగ్ చేయించకపోవడం విశేషం.

ఇన్నింగ్స్ 8 వ ఓవర్లో పటిదార్ బ్యాటింగ్ కు వచ్చాడు. తొలి 10 ఓవర్లలో 6 ఓవర్లు స్పిన్నర్లు వేయగా.. ఆ తర్వాత 10 ఓవర్లలో ఒక్క స్పిన్నర్ కూడా బౌలింగ్ వేయలేదు. అయితే ఈ ఆర్సీబీ బ్యాటర్ కోసం ప్లాన్ వేసినప్పటికీ అతన్ని ఆపలేకపోయారు. 40 బంతుల్లో 6 ఫోర్లు.. 6 సిక్సర్లతో 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పటిదార్ ఒంటరి పోరాటం చేసి జట్టుకు భారీ స్కోర్ అందించినా బౌలింగ్ లో విఫలం కావడంతో మధ్యప్రదేశ్ ఓడిపోయి రన్నరప్ తో సరిపెట్టుకుంది.  

Also Read:-అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయకుండా షకీబ్ అల్ హసన్‌‌పై సస్పెండ్..

ఆదివారం జరిగిన ఫైనల్లో ముంబై 5 వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌పై గెలిచింది. దీంతో 2022–23లో సాధించిన టైటిల్‌‌‌‌‌‌‌‌ను మళ్లీ నిలబెట్టుకుంది. టాస్‌‌‌‌‌‌‌‌ ఓడిన మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌ 20 ఓవర్లలో 174/8 స్కోరు చేసింది. రజత్‌‌‌‌‌‌‌‌ పటీదార్‌‌‌‌‌‌‌‌ (81) భారీ స్కోరుతో రెచ్చిపోయినా మిగతా బ్యాటర్ల నుంచి సహకారం అందలేదు. భారీ టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేదనలో సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ (48), అజింక్యా రహానె (37), సూర్యాన్ష్‌‌‌‌‌‌‌‌ షెడ్జే (36 నాటౌట్‌‌‌‌‌‌‌‌) చెలరేగడంతో ముంబై టార్గెట్ ను ఈజీగా ఛేజ్ చేసింది. మరో 13 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి గెలిచింది.