ఆయుష్‌‌‌‌‌‌‌‌ అదరహో

అహ్మదాబాద్‌ ‌‌‌‌‌‌‌:  ముంబై యంగ్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ ఆయుష్‌‌‌‌‌‌‌‌ మాత్రే (117 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 15 ఫోర్లు, 11 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 181) లిస్ట్‌‌‌‌‌‌‌‌–ఎ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో వరల్డ్‌‌‌‌‌‌‌‌ రికార్డు నెలకొల్పాడు. విజయ్‌‌‌‌‌‌‌‌ హజారే ట్రోఫీలో భాగంగా మంగళవారం నాగాలాండ్‌‌‌‌‌‌‌‌తో జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 150కి పైగా రన్స్‌‌‌‌‌‌‌‌ చేసిన తొలి యంగెస్ట్‌‌‌‌‌‌‌‌ (17 ఏళ్ల 168 రోజులు) బ్యాటర్‌‌‌‌‌‌‌‌గా రికార్డులకెక్కాడు. దీంతో 2019లో జార్ఖండ్‌‌‌‌‌‌‌‌పై యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌ (17 ఏళ్ల 291 రోజులు) నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. ఆయుష్‌‌‌‌‌‌‌‌ రికార్డు పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌కు తోడు శార్దూల్ ఠాకూర్‌‌‌‌‌‌‌‌ (28 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 8 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 73 నాటౌట్‌‌‌‌‌‌‌‌) దంచికొట్టడంతో ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ముంబై 198 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో నాగాలాండ్‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసింది.

టాస్‌‌‌‌‌‌‌‌ ఓడిన ముంబై 50 ఓవర్లలో 403/7 స్కోరు చేసింది. ఆయుష్‌‌‌‌‌‌‌‌, రఘువంశీ (56) తొలి వికెట్‌‌‌‌‌‌‌‌కు 156 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించి శుభారంభాన్నిచ్చారు. తర్వాత నాగాలాండ్‌‌‌‌‌‌‌‌ 50 ఓవర్లలో 214/9 స్కోరుకే పరిమితమైంది. జగదీశ సుచిత్‌‌‌‌‌‌‌‌ (104), రుపెరో (53), లెమ్‌‌‌‌‌‌‌‌టుర్‌‌‌‌‌‌‌‌ (27) పోరాడినా ప్రయోజనం దక్కలేదు. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఎనిమిది మంది సింగిల్‌‌‌‌‌‌‌‌ డిజిట్‌‌‌‌‌‌‌‌కే పరిమితమయ్యారు. ఆయుష్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది.