నలుగురు ట్రాక్టర్​ దొంగల అరెస్ట్..రూ. 45 వేల నగదు, ఓ కార్, బైక్ స్వాధీనం

ములుగు, వెలుగు: రాత్రిపూట ట్రాక్టర్​దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్​చేశారు. ఎస్ఐ విజయ్ కుమార్ కథనం ప్రకారం..  ములుగు మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన పల్లచ్చు స్వామి ట్రాక్టర్, కల్టివేటర్ నుఈ నెల19న దొంగలు ఎత్తుకెళ్లారు. వర్గల్ మండలం సాకారం గ్రామంలోని మరో వ్యక్తి ట్రాక్టర్ ని సైతం దొంగలించారు. బాధితులు 21న ములుగు, వర్గల్ పీఎస్​లలో కంప్లైంట్​చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం నాగిపల్లికి  చెందిన చెరుకుపల్లి రవీందర్ రెడ్డి, నల్గొండ జిల్లా గుట్ట తుర్కపల్లి మండలం నాగాయపల్లికి చెందిన అలమైన మల్లేశ్, సిద్దిపేట జిల్లా ములుగు మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన అన్నబోయిన నాగరాజు, పల్లె ప్రవీణ్ ముఠాగా ఏర్పడి ట్రాక్టర్లను ఎత్తుకెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నారు. వీరి దగ్గరి నుంచి రూ.45 వేల నగదు, ఒక బ్రీజా కారు, బైక్​స్వాధీనం చేసుకొని నలుగురిని రిమాండ్​కు తరలించినట్లు ఎస్​తెలిపారు. కేసు పరిశోధనలో గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి, ఏఎస్ఐ నాగేశ్వరరావు, కానిస్టేబుల్ విగ్నేశ్, విజయ్, కృష్ణమూర్తి, కిషన్, రమేశ్, గిరి, పరుశరాములు పాల్గొన్నారు.