జిల్లా పోలీసుల పనితీరు బేష్

  • మల్టీ జోన్ టూ ఐజీ సత్యనారాయణ

సంగారెడ్డి టౌన్, వెలుగు: గత ఏడాదితో పోలిస్తే  జిల్లాలో క్రైమ్ రేట్ పెరిగినప్పటికీ పోలీసుల పనితీరు బాగుందని మల్టీజోన్ టూ ఐజీ సత్యనారాయణ అన్నారు. శనివారం వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిబ్బందికి రావాల్సిన ఇంక్రిమెంట్స్, సరెండర్ లీవ్స్, రివార్డుల బిల్లులను వెంటనే చెల్లించాలని అడ్మిన్ ఆఫీసర్​కు సూచించారు. వివిధ సెక్షన్లను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. 

ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. డిసెంబర్ 31, న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ప్రజలకు సూచించారు. జిల్లాలో పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్​ఎస్పీలు సంజీవరావు, శ్రీనివాసరావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్​కల్యాణి, డీఎస్పీలు సత్తయ్య గౌడ్, రవీందర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి ,వెంకట్ రెడ్డి, ఇన్​స్పెక్టర్లు ఆర్ఐలు పాల్గొన్నారు.