లాంచ్ చేసిన నటి నిహారిక
హైదరాబాద్, వెలుగు: మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్ సెల్‌బే.. షావోమీ లేటెస్ట్ మిడ్రేజ్5జీ ఫోన్ రెడ్‌మీ నోట్ 12 సిరీస్ ఫోన్ల అమ్మకాలను మొదలుపెట్టింది. గచ్చిబౌలి షోరూమ్‌లో జరిగిన లాంచ్ కార్యక్రమానికి చీఫ్‌గెస్ట్‌గా నటి నిహారిక కొణిదెల వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సెల్‌బేతో తనకు ఎంతో అనుబంధం ఉందని అన్నారు. ఇంతకు ముందు కూడా ఒక సెల్‌బే షోరూమ్‌ను ప్రారంభించానని చెప్పారు. ఈ సంస్థ తన కస్టమర్‌లకు అత్యుత్తమ ఉత్పత్తులను, సేవలను సమర్థంగా అందజేస్తోందని ప్రశంసించారు. రెడ్‌మీ నోట్12 సిరీస్ ఫోన్లలో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయని అన్నారు. షావోమీ తెచ్చిన అత్యుత్తమ హ్యాండ్ సెట్‌లలో ఇదీ ఒకటి అని ఆమె చెప్పారు. సెల్‌బే మేనేజింగ్ డైరెక్టర్ సోమ నాగరాజు మాట్లాడుతూ రెడ్‌మీ 12 నోట్ సిరీస్‌ను పరిచయం చేయడం సంతోషంగా ఉందని అన్నారు.
‘‘షావోమీ 5జీ వాడకాన్ని మరింత పెంచాలనే టార్గెట్‌తో పనిచేస్తోంది. నోట్12 ప్రో ఫోన్ 19 నిమిషాల్లో 100శాతం చార్జ్ అవుతుంది. ఫోన్‌తోపాటు 67 వాట్ల చార్జర్ వస్తుంది. రెడ్‌మీ నోట్ 12 ప్రో ద్వారా వచ్చే 120 వాట్ల చార్జర్‌తో 15 నిమిషాలలో ఫోన్ పూర్తిగా చార్జ్ అవుతుంది. ఈ సిరీస్ ఫోన్లలో 200 ఎంపీ కెమెరా సెన్సర్ ఉంటుంది. రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్‌లో ప్రో-గ్రేడ్ హెచ్పీఎక్స్ సెన్సార్, ఐఓఎస్ ఉండటం వల్ల తక్కువ వెలుతురులోనూ ఫొటోలు బాగా వస్తాయి. ఈ ఫోన్లను గేమ్ లవర్స్ కూడా ఇష్టపడతారు”అని అన్నారు. సెల్‌బే స్ట్రాటజీ & ప్లానింగ్ డైరెక్టర్ నల్లచెరువు సుహాస్ మాట్లాడుతూ రెడ్‌మీ నోట్ సిరీస్ ఫోన్లు పలు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నోట్12(4జీబీ+128జీబీ, 6జీబీ+128జీబీ), నోట్12ప్రో(6జీబీ+128జీబీ,8జీబీ+128జీబ,8జీబీ+256జీబీ), నోట్12ప్రో ప్లస్ఫోన్లు 8జీబీ+256జీబీ కాన్ఫిగరేషన్‌తో వస్తాయన్నారు. వీటి ధరలు రూ.18 వేల నుంచి మొదలవుతాయి. ఆర్కిటిక్ వైట్, ఐస్‌బర్గ్ బ్లూ, అబ్సిడియన్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు.
