బీజేపీలోకి ములాయం సన్నిహితుడు బేరియా!

బీజేపీలోకి ములాయం సన్నిహితుడు బేరియా!

మరి కొద్ది రోజుల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయం వేడెక్కింది. జంప్ జిలానీలు కూడా పెద్ద సంఖ్యలో పార్టీలు మారుతున్నారు. లేటెస్టుగా  ములాయం సింగ్ కు అత్యంత సన్నిహితుడైన శివకుమార్ బేరియా ఇవాళ( సోమవారం) బీజేపీలో చేరినట్లు తెలుస్తోంది. సమాజ్ వాదీ పార్టీ (SP)హయాంలో ఆయన మంత్రిగా కూడా పని చేశారు.

అంతేకాదు SP ఎమ్మెల్సీ రమేశ్ మిశ్రా కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు  జనవరి 13న బీజేపీకి గుడ్ బై చెప్పి సమాజ్ వాదీ పార్టీలో చేరిన ఎమ్మెల్యే ధౌరారా మళ్లీ బీజేపీ గూటికి చేరారు. ములాయం కోడలు అపర్ణా యాదవ్ బీజేపీలో చేరిన తర్వాత ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి.

మరిన్ని వార్తల కోసం...

ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం పొడగింపు