రిలయన్స్​ చేతికి ఫ్యూచర్​ స్టోర్లు

రిలయన్స్​ చేతికి ఫ్యూచర్​ స్టోర్లు

న్యూఢిల్లీ: ముకేశ్​ అంబానీకి చెందిన రిలయన్స్​ గ్రూపు కిశోర్​ బియానీకి చెందిన ఫ్యూచర్​ గ్రూపు రిటైల్​ స్టోర్లను చేజిక్కించుకుంది. ఫ్యూచర్​ ఉద్యోగులకు జాబ్స్​ కూడా ఆఫర్​ చేస్తోంది. ఈ విషయమై ఫ్యూచర్స్​–అమెజాన్​ మధ్య వివాదం నడుస్తున్నప్పటికీ రిలయన్స్​ ఈ డీల్​ను పూర్తి చేసింది. ఈ విషయమై పలు కోర్టుల్లో అమెజాన్​ కేసులు కూడా వేసింది. రిలయన్స్​ మాత్రం బిగ్​బజార్​ వంటి స్టోర్లను తన బ్రాండ్​ పేర్లతో ముస్తాబు చేస్తోంది. ఇక నుంచి ఫ్యూచర్​ ఉద్యోగులకు రియలన్స్​ రిటైల్ పేరోల్ నుంచి జీతాలు ఇస్తామని తెలిపింది. ఈ విషయమై మాట్లాడటానికి అమెజాన్​ అంగీకరించలేదు. ఫ్యూచర్స్​ స్టోర్ల కొనుగోలు కోసం రిలయన్స్​ 2020లోనే డీల్​ కుదుర్చుకుంది. అయితే ఫ్యూచర్స్​ కూపన్​లో ఇది వరకే తమకు వాటా ఉంది కాబట్టి రిటైల్​ సెగ్మెంట్​ కూడా తమకే దక్కాలని అమెజాన్​ వాదిస్తోంది. అప్పుల్లో ఉన్న ఫ్యూచర్‌‌‌‌ గ్రూప్‌‌ తన రిటైల్‌‌ వ్యాపారాన్ని రిలయన్స్‌‌కు 2020 ఆగస్టులో అమ్మింది. ఈ డీల్‌‌ విలువ రూ.24,713 కోట్లు. దీనిపై అమెజాన్‌‌ మొదటి నుంచి అభ్యంతరం చెబుతోంది.