రిలయన్స్‌‌ రిటైల్‌‌కు తాకిన సెగ.. ఫార్మింగ్‌లోకి వచ్చే ఉద్దేశం లేదు

రిలయన్స్‌‌ రిటైల్‌‌కు తాకిన సెగ.. ఫార్మింగ్‌లోకి వచ్చే ఉద్దేశం లేదు
పొలాల్లోకి దిగం: అంబానీ టవర్ల ధ్వంసంపై పంజాబ్‌‌, హర్యానా హైకోర్టుకు వెళ్లిన జియో ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తోందన్న వొడాఫోన్‌‌ ఐడియా హైదరాబాద్‌‌, వెలుగు: రైతు ఉద్యమం దేశంలో రకరకాల టర్న్‌‌లు తీసుకుంటోంది. ఓ వైపు పంజాబ్‌‌లో రిలయన్స్‌‌ జియో టవర్లను కొంత మంది ధ్వంసం చేస్తుంటే, మరోవైపు తమకు కాంట్రాక్ట్‌‌ ఫార్మింగ్‌‌లోకి ఎంటరవ్వాలని లేదని రిలయన్స్‌‌ ప్రకటించుకుంటోంది. రైతుల ఆందోళన టెలికం రంగంలో వార్‌‌కు దారి తీస్తున్నట్లు కనిపిస్తోందని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. టవర్స్‌‌ ధ్వంసంపై పంజాబ్‌‌ అండ్‌‌ హర్యానా హైకోర్టును జియో ఆశ్రయిస్తే, మరోవైపు వీఐ (వొడాఫోన్‌‌ ఐడియా) జియోపై విమర్శలు గుప్పిస్తోంది. టవర్ల ధ్వంసం వెనక ప్రత్యర్ధుల కుట్ర ఉందని జియో ఆరోపిస్తుంటే, ఎయిర్‌‌టెల్‌‌, వొడాఫోన్‌‌ ఐడియాలు ఆ విమర్శలను తీవ్రంగా తిప్పి కొడుతున్నాయి. టవర్స్‌‌తోపాటు, తమ ఉద్యోగులకూ రక్షణ కావాలని రిలయన్స్‌‌ కోర్టును కోరింది. అంతేకాకుండా, జియోను వదిలి ఇతర ఆపరేటర్లకు మారాలని కస్టమర్లను ప్రత్యర్ధి కంపెనీలు వత్తిడి తెస్తున్నాయని, కాబట్టి పోర్ట్‌‌–అవుట్‌‌ ఆప్షన్స్‌‌ను కొంత కాలం పంజాబ్‌‌, హర్యానాలో నిలిపి వేయాలని కూడా డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ టెలికంను రిలయన్స్‌‌ కోరుతోంది. దేశంలోని ఏ ఆపరేటర్‌‌ టవర్స్‌‌పైనా  ఎలాంటి చర్యలకూ తాము పాల్పడలేదని, జియో విమర్శలు కల్పితమని వొడాఫోన్‌‌ ఐడియా చెబుతోంది. రిలయన్స్‌‌ రిటైల్‌‌కు తాకిన సెగ నవంబర్‌‌లో కొన్ని రైతు గ్రూప్‌‌లు పంజాబ్‌‌లోని రిలయన్స్‌‌ ఫ్రెష్‌‌ స్టోర్స్‌‌ కొన్నింటిని మూసి వేశాయి. కొత్త వ్యవసాయ చట్టాలు కార్పొరేట్‌‌ ఫార్మింగ్‌‌కు దారి తీస్తాయని కొన్ని  రైతు గ్రూప్‌‌లు భయపడుతుండటమే దీనికి కారణం. కాంట్రాక్ట్‌‌ లేదా కార్పొరేట్‌‌ ఫార్మింగ్‌‌లోకి ఎంటరయ్యే ప్రసక్తే లేదని రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌ లిమిటెడ్‌‌ (ఆర్‌‌ఐఎల్‌‌) సోమవారం ప్రకటించింది.దేశంలో రైతుల ప్రయోజనాలను కాపాడటానికి కంపెనీ కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. పొలాలను ఎప్పుడూ కొనలేదని కూడా స్పష్టం చేసింది. తమ రిటెయిల్‌‌ సబ్సిడరీ రిలయన్స్‌‌ రిటెయిల్‌‌ కూడా రైతుల నుంచి నేరుగా ఫుడ్‌‌ గ్రెయిన్స్‌‌ను కొనడం లేదని వెల్లడించింది. రైతులకు మెరుగైన రేటు (కనీస మద్దతు ధర–మినిమం సపోర్ట్‌‌ ప్రైస్‌‌) లభించేలా తమ సప్లయర్స్‌‌ కట్టుబడి ఉండాలని కూడా తాము ఎప్పుడూ కోరుతున్నట్లు ఆర్‌‌ఐఎల్‌‌ తెలిపింది. రైతులకు నష్టం కలిగేలా ఎలాంటి లాంగ్‌‌ టర్మ్‌‌ ప్రొక్యూర్‌‌మెంట్‌‌ కాంట్రాక్ట్స్‌‌నూ కుదుర్చుకోలేదని చెప్పింది. గిట్టుబాటు రేటు కంటే తక్కువ రేటుకు రైతుల నుంచి ప్రొక్యూర్‌‌మెంట్‌‌ చేయమని సప్లయర్స్‌‌ను కోరలేదని, కోరే ఆలోచన లేదని  కూడా క్లారిటీ ఇచ్చింది. For More News.. రెస్టారెంట్‌కు వెళ్లిన ఇండియన్ ప్లేయర్లకు లైన్ క్లియర్ కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ఇలాఖాలో వర్క్‌‌‌‌ ప్రోగ్రెస్‌‌‌‌ పూర్ రూ.1,300 కోట్ల రుణమాఫీకి ఇచ్చింది 20 కోట్లే