ఇండియన్ రిటైల్ పేమెంట్ సిస్టమ్‌‌లోకి ముఖేష్ అంబానీ

ఇండియన్ రిటైల్ పేమెంట్ సిస్టమ్‌‌లోకి ముఖేష్ అంబానీ

ఇండియన్ రిటైల్ పేమెంట్ సిస్టమ్‌‌లోకి టాప్‌ కార్పొరేట్ కంపెనీలు ఎంటర్‌ కాబోతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌‌పీసీఐ) లాంటి రిటైల్ పేమెంట్ సిస్టమ్‌‌ను ఏర్పాటు చేసి, ఆపరేట్ చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఇండియా(ఆర్‌బీఐ) ప్రైవేట్ సంస్థ లకు అనుమతి ఇవ్వాలనుకుంటోంది. దీనికోసం గైడ్‌లైన్స్‌ ‌ను కూడా రూపొందిస్తోంది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, పేమెంట్ కంపెనీ పేటీఎం, క్యాపిటల్ మార్కెట్ ఎక్స్చేంజ్‌లు ఎన్‌‌ఎ స్‌ఈ, బీఎస్‌ఈ లాంటి టాప్ సంస్థలు ఈ లైసెన్స్ పొందేందుకు చూస్తున్నాయి. ఎన్‌‌పీసీఐ లాంటి ప్లాట్‌‌ఫామ్‌‌ను ఆపరేట్ చేసేందుకు ఈ సంస్థలు పోటీ పడుతున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఎన్‌‌పీసీఐ ప్రస్తుతం అన్ని ఎలక్ట్రానిక్ రిటైల్ పేమెం ట్స్‌‌కు ఒక హబ్‌గా ఉంది. యూపీఐ పేమెంట్స్అం దిస్తున్న భీమ్‌‌యాప్‌‌ను ఎన్‌‌పీసీఐనే రూపకల్పన చేసింది. డీమానిటైజేషన్ కాలం నుంచి దేశంలో డిజిటల్ పేమెంట్లు ఊపందుకోవడానికి ఒక ప్రధాన కారణంగా భీమ్ యాప్‌‌ను చెప్పుకోవచ్చు. ఎలక్ట్రానిక్ రీటైల్  పేమెంట్స్‌ ‌మార్కెట్‌లో ఎన్‌‌పీసీఐ దే అగ్రస్థానం. యూపీఐ, ఎన్‌‌ఏసీహెచ్‌, నేషనల్ ఫైనాన్సియల్ స్విచ్  , ఐఎంపీఎ లాంటి ముఖ్యమైన ప్లాట్‌‌ఫామ్స్‌‌కు ఇదే బాధ్యత వహిస్తోంది. ఇప్పుడు ఈ మార్కెట్‌లోకి ప్రైవేట్ సంస్థ లను ఆర్‌బీఐ అను మతిస్తోంది. ఆర్‌బీఐ ఇస్తోన్న ఈ అవకాశాన్నిఅం దిపుచ్చుకోవడానికి రిలయన్స్, బీఎస్‌ఈ, ఎన్‌‌ఎ స్‌ఈ, పేటీఎం లాంటి సంస్థలు అడ్వయిజరను్ల కూడా నియమించుకున్నాయి. దీనికి సంబంధిం చిన విధివిధానాలపై ప్రైవేట్ కంపెనీలు, ఆర్‌బీఐతో చర్చలు జరుపుతున్నాయి. పేమెంట్ సెటిల్‌‌మెంట్ చేసేందుకు తమ వద్ద నైపుణ్యం, ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్నట్టు కంపెనీలు భావిస్తున్నాయి. ఎన్‌‌పీసీఐ లాంటి సంస్థను ఏర్పాటు చేసే అవకాశం ఎవరికి దక్కినా కూడా ఇండియాలో వచ్చే పేమెంట్ రివా ల్యుషన్‌‌లో వారే ముందంజలో ఉండనున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ప్రమోటర్‌కు ఉండాల్సిన అర్హతలు…

ప్రతిపాదిత సంస్థను ఆర్‌బీఐ రెగ్యులేట్ చేయనుంది. పేమెంట్స్ అండ్ సెటిల్‌‌మెంట్ సిస్టమ్స్ యాక్(ట్పీఎస్‌ఎస్‌ఏ) 2007 కింద ఆథరైజ్ చేయనుంది. ఈ ఏడాది చివరి వరకు దీని గైడ్‌లైన్స్‌‌ను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కనీసంరెం డు లైసెన్స్‌‌లను జారీ చేయాలని చూస్తోంది. డ్రాఫ్ట్ నిబంధనల ప్రకారం, న్యూ అంబ్రెల్లా ఎంటిటీకి మినిమమ్ పేయిడ్ అప్‌ క్యాపిటల్ రూ.500 కోట్ల వరకు ఉండాలి. అయితే ఈ క్యాపిటల్‌‌లో ప్రమోటర్ వాటా 40 శాతంకంటే ఎక్కువ ఉండకూడదు. అరత గల ప్రమోటర్‌ ్హ‌‌‌కు సర్వీసు ప్రొవైడర్‌గా, పేమెంట్స్రంగంలో టెక్నాలజీ పారనర్‌్ట గా కనీసం 3 ఏళ అ్ల నుభవం ఉండాలి.

రిలయన్స్‌‌ నుంచి రైట్స్‌‌ ఇష్యూ

రిలయన్స్‌‌ఇండస్ట్రీస్‌‌లిమిటెడ్‌‌ (ఆర్‌‌ఐఎల్‌‌) రైట్స్‌ ‌ఇష్యూ ద్వారా నిధులు సమీకరించుకోవాలని నిర్ణయించింది. ఎన్నినిధులను సేకరిస్తుందనే వివరాలను కంపెనీబయటపెట్టలేదు. అప్పులను తగ్గించడానికే రైట్స్‌ ‌ఇష్యూను ఎంచుకుందని ఎనలిస్టులు చెబుతున్నారు. ప్రస్తుత షేర్‌‌హోల్డర్లకు ఈక్విటీషేర్లను కేటాయించే ప్రపోజల్‌‌పై చర్చించడానికి ఈనెల30న బోర్డు మీటింగ్‌ ‌జరుగుతుందని కంపెనీ తెలిపింది. కంపెనీకి ప్రస్తుతం 23లక్షల మంది షేర్‌‌హోల్డర్లు ఉన్నారు. అంబానీ, ఆయన ఫ్యామిలీకి 50శాతం వాటాలు ఉన్నాయి. రిలయన్స్‌‌మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ విలువ రూ.9.1లక్షలకోట్ల వరకు ఉంది.