ర్యాంక్ పడిపోయింది : ప్రపంచ కుబేరుడు అంబానీకి షాక్

ర్యాంక్ పడిపోయింది : ప్రపంచ కుబేరుడు అంబానీకి షాక్
ప్రపంచంలోనే 10 అత్యంత ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ వెనక్కి వెళ్లారు. బ్లూమ్ బెర్గ్ ఇండెక్స్ కథనం ప్రకారం.. గతంలో ప్రపంచంలో 10 అత్యంత ధనవంతుల ముఖేష్ అంబానీ ఉన్నారు. అయితే ఇటీవల ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీ.. ఫూచర్ గ్రూప్ ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీ ఒక్కో షేర్ ధర రూ.2,369 కు చేరింది. అయితే బుధవారం రిలయన్స్ షేర్ల ధర ఒక్కసారి కుప్పకూలింది. రూ.2,369గా ఉన్న రిలయన్స్ షేర్ ధర 1994.15కి చేరింది. దీంతో ముఖేష్ అంబానీ భారీ నష్టాల్ని చవిచూశారు. రిలయన్స్ షేర్ రూ.2369 ఉండగా ముఖేషే అంబానీ ఆస్తి రూ.6.62 లక్షల కోట్లగా ఉంది. అదే షేర్ ధర రూ.1994.15కి పడిపోవడంతో ముఖేష్ అంబానీ ఆస్తి రూ.5.63లక్షల కోట్లకు పడి పోయింది. దీంతో మొన్నటి వరకు ప్రపంచలోనే అంత్యత ధనవంతుల జాబితాలో 10స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ నష్టాల బాట పట్టడంతో 11స్థానానికి దిగజారారు. ఇక ముఖేష్ అంబానీ స్థానాన్ని అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త, ఒరాకిల్ సీటీఓ లారీ ఎల్లిసన్ దిక్కించుకోగా.., గూగుల్ కో‌‌- ఫౌండర్ సెర్గీ బ్రిన్ 9వ స్థానంలో నిలిచారు.