కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరనున్నట్లు ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇంత కాలం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ కాపు సామజికవర్గ హక్కుల కోసం పోరాడిన ఆయన ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో బిజీ అయ్యేందుకు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరే రూట్ మ్యాప్ ని రిలీజ్ చేశారు. ప్రజలను ఉద్దేశించి రాసిన లేఖలో ఈ రూట్ మ్యాప్ ను రిలీజ్ చేశారు ముద్రగడ. జగన్ ను తిరిగి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టేందుకు ఎలాంటి కోరికలు లేకుండా పని చేసేందుకు నిర్ణయించుకున్నానని లేఖలో తెలిపారు ముద్రగడ.
ALSO READ :- యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు.. తొలిరోజు సీఎం దపంతుల ప్రత్యేక పూజలు
జగన్ ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ సంక్షేమ పథకాలతో పాటు వీలైనంత అభివృద్ధి కూడా జరిగేలా చూడాలని నిర్ణయించుకున్నట్లు ముద్రగడ తెలిపారు. ఈ నెల 14న వైసీపీలో చేరనున్నట్లు, ఈ సందర్బంగా చేపట్టే ర్యాలీకి హాజరయ్యే ప్రజలు ఎవరి ఆహరం, ఇతర అవసరాలు వారే స్వయంగా వాహనాల్లో తెచ్చుకోవాలని కోరారు.ఈ క్రమంలో ర్యాలీ రూట్ మ్యాప్ ను రిలీజ్ చేశారు. ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడి నుండి సాగే ఈ ర్యాలీ, ప్రత్తిపాడు, జగ్గంపేట, లాలాచెరువు, వేమగిరి, రావులపాలెం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరుఎం విజయవాడ మీదగా తాడేపల్లి చేరుకుంటుందని తెలిపారు.