2024 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏపీలో రాజకీయ వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. అధికార వైసీపీ అందరికంటే ముందుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించి వరుస బహిరంగ సభలతో దూసుకుపోతుండగా, సీట్ల పంపకం విషయంలో చాలా కాలం పాటు తర్హానబర్జనలు పడ్డ తర్వాత టీడీపీ, జనసేన కూటమి ఇటీవలే ఉమ్మడి అబ్యర్థుల జాబితా ప్రకటించింది. ఇదిలా ఉండగా, కూటమి ప్రకటించిన 118సీట్లలో జనసేన 24సీట్లకే పరిమితం కాగా, 5స్థానాలకు మినహా మిగతా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. అంతే కాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారన్నది ఇంకా క్లారిటీ రాలేదు.
మొన్నటిదాకా పవన్ భీమవరం నుండి పోటీ చేస్తారని భావించగా, ఆ స్థానాన్ని ఇటీవల టీడీపీ నుండి జనసేనలో చేరిన టీడీపీ నేత అంజిబాబుకు కేటాయిస్తారని వార్తలొస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తాడన్న ప్రచారం ఊపందుకుంది. పిఠాపురంలో కాపు సామాజికవర్గ ఓట్లు ఎక్కువగా ఉన్న కారణంగా ఆ స్థానాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా పవన్ కి షాక్ ఇచ్చే మరో వార్త హల్చల్ చేస్తోంది. అదేంటంటే, పిఠాపురంలో పవన్ కి పోటీగా కాపు నేత ముద్రగడ పద్మనాభాన్ని దించాలని జగన్ డిసైడ్ అయ్యాడని టాక్ వినిపిస్తోంది.
also read : టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
ఈ మేరకు పిఠాపురం సమన్వయకర్త వంగా గీతను సీఎంఓకు పిలిపించుకొని చర్చలు జరిపారని, రెండు రోజుల్లో ముద్రగడ పార్టీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. ముద్రగడ పిఠాపురం బరిలో దిగితే గనక పవన్ కళ్యాణ్ కి చెక్ పడ్డట్టే అవుతుందని చెప్పాలి.ఇప్పటికే జనసేన పీఏసీ మెంబర్, హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ వైసీపీలో చేరటం జనసేన మీద ప్రభావం చూపుతుందని భావిస్తున్న క్రమంలో ముద్రగడ రూపంలో జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ ని పవన్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.