జగన్ సమక్షంలో వైసీపీలోకి ముద్రగడ...

2024 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. ఇదిలా ఉండగా, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరాడు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో జగన్ సమక్షంలో తన కుమారుడు గిరితో కలిసి వైసీపీలో  చేరాడు ముద్రగడ. ఈ నెల 14న తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీతో పార్టీలో చేరాలని అనుకున్నప్పటికీ అనివార్య కారణాల వల్ల ర్యాలీని రద్దు చేసి ఇవాళ పార్టీలో చేరారు ముద్రగడ.

ఇటీవల మాజీమంత్రి హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ కూడా వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ముద్రగడ కూడా వైసీపీలో చేరటంతో  గోదావరి జిల్లాల్లో వైసీపీ గ్రాఫ్ పెరిగినట్లే అని చెప్పాలి. ముద్రగడను పవన్ కి పోటీగా పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి బరిలో దింపేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నాడని ప్రచారం జరిగిన నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చినా, రాకున్నా పార్టీలో చేరానని ముద్రగడ క్లారిటీ ఇచ్చాడు.