కాపు ఉద్యమ నేత, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తనపై బ్లేడ్ బ్యాచ్ దాడి చేస్తున్నారంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ముద్రగడ మండిపడ్డారు. కార్యకర్తలకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వటానికి పవన్ కళ్యాణ్ ఇష్టపడడని, ఫ్యాన్స్, కార్యకర్తలు దగ్గరకు రాకుండా పవన్ కళ్యాణ్ చుట్టూ మూడు షిఫ్ట్ లలో బౌన్సర్లు ఉంటారని అన్నారు. అలాంటి వ్యక్తిపై బ్లేడ్ బ్యాచ్ ఎలా దాడి చేస్తుందని ప్రశ్నించారు.
కార్యకర్తలను దూరంగా పెట్టేందుకే పవన్ కళ్యాణ్ బ్లేడ్ బాసిత్ డ్రామా ఆడుతున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ కు రాజకీయం చేయటం చేతకాదని, ఆయన పాలిటిక్స్ కి పనికి రాడని అన్నారు. జనాల్లో తిరగటానికి కూడా భయపడే వ్యక్తికి రాజకీయాలు అవసరమా అని అన్నారు. పవన్ కళ్యాణ్ పిరికితనంతోనే బ్లేడ్ బ్యాచ్ వ్యాఖ్యలు చేస్తున్నాడని అన్నారు. కార్యకర్తలను కూడా దగ్గరకి రానివ్వని పవన్ కళ్యాణ్ వద్దకు బ్లేడ్ బ్యాచ్ ఎలా వెళ్తారని ప్రశ్నించారు ముద్రగడ. కాగా, ఇటీవలే పిఠాపురం నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ కు తీవ్ర జ్వరం రావటంతో ప్రచారానికి బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాడు.