చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఓటమి కోసమే పని చేస్తా - ముద్రగడ

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇటీవలే వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. జగన్ ను సీఎం చేయటమే లక్ష్యంగా టికెట్ కూడా ఆశించకుండా వైసీపీలో చేరారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను ఓడించటం కోసమే పని చేస్తానని అన్నారు. బొచ్చుగాళ్ళు వాళ్ళే వారసత్వం చేయాలా?, నా కొడుకు ఎందుకు రాకూడదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ముద్రగడ.

పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఘాటైన విమర్శలు చేశారు ముద్రగడ. చిరంజీవి ఓడిపోయాడు, పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు, ఉద్యమం వల్ల నేను నష్టపోయా, తాను అమ్ముడుపోయి జనాలకు లక్షలు ఇస్తున్నారని అంటే ఎలా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఐదేళ్లు పవన్ ఏ మడుగులో ఉన్నాడని ప్రశ్నించాడు ముద్రగడ. వైసీపీలో చేరకపోయి ఉంటే పవన్ కళ్యాణ్ మీద ఇండిపెండెంట్ గా పోటీ చేసేవాడిని అని అన్నారు. తన శత్రువులతో పవన్ ఎలా కలుస్తాడని ముద్రగడ ప్రశ్నించారు. పిఠాపురంలో పవన్ ఓటమి ఖాయమని అన్నారు. జగన్ కు, పవన్ కు చాలా తేడా ఉందని, బాబు, పవన్ లను ఓడించటం కోసం ఎంతవరకైనా వెళ్తానని అన్నారు ముద్రగడ.