మరికల్ లో సీఎం, ఎమ్మెల్యే ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

మరికల్, వెలుగు : ముదిరాజ్​లను బీసీ–డి నుంచి బీసీ–ఏ గ్రూపులోకి మార్చేందుకు కృషి చేస్తానని సీఎం రేవంత్​రెడ్డి ఇచ్చిన హామీని స్వాగతిస్తూ బుధవారం సీఎం, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఫ్లెక్సీకి ముదిరాజ్​లు క్షీరాభిషేకం నిర్వహించారు. 

బుధవారం పార్టీ మండల అధ్యక్షుడు వీరణ్ణ, ఓబీసీ జిల్లా చైర్మన్​ గొల్ల కృష్ణయ్య ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేసి, స్వీట్లు పంచిపెట్టారు. వినీతమ్మ, సూర్యమోహన్​రెడ్డి, హరీశ్, ఆంజనేయులు, రామకృష్ణ, సత్యప్ప, మొగులయ్య పాల్గొన్నారు.