రిటైర్మెంట్ త‌ర్వాత ధోనీ ఏం చేయ‌బోతున్నారంటే

రిటైర్మెంట్ త‌ర్వాత ధోనీ ఏం చేయ‌బోతున్నారంటే

ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ..ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెప్పిన విష‌యం తెలిసిందే. మ‌రి క్రికెట్ నుంచి వీడుక్కోలు తీసుకున్న ధోనీ ఏం నెక్ట్స్ ఏం చేస్తార‌నేది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది.

సాధార‌ణంగా ఏ క్రికెట‌ర్ అయినా అంత‌ర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు ప‌లికిన త‌రువాత బిజినెస్ లేదంటే కామెంటీట‌ర్ , కోచ్ ఇలా ప‌లు విభాగాల్లో త‌మ‌దైన పాత్ర పోషిస్తూ ముందుకు సాగుతుంటారు.

కానీ ధోనీ మాత్రం ఎక్కువ కాలం దేశానికి సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్న‌రంటూ ఆయ‌న స్నేహితుడు, బిజినెస్ పార్ట్ న‌ర్ అరుణ్ పాండే తెలిపారు.

క్రికెట్ నుంచి దూరం అయితే బ్రాండ్ వ్యాల్యూ ప‌డిపోతుంది. ఆ విష‌యం ధోనీకి బాగా తెలుసు. మ‌నం ధోనీ నిర్ణ‌యాన్ని గౌర‌వించాలి. ఎక్కువ కాలంలో దేశానికి చేసేందుకు ఆర్మీలో విధులు నిర్వ‌హిస్తూనే త‌న ఎండార్స్ మెంట్ల ను కొన‌సాగిస్తార‌ని వెల్ల‌డించారు.

దేశానికి సేవ‌చేసేందుకు  ఆర్మీలో లెప్టినెంట్ క‌ల్న‌ల్ హోదాలో నెల‌రోజుల పాటు ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకున్నారు. ఇప్పుడు రిటైర్మెంట్ త‌రువాత అదే హోదాలో  ఆర్మీలో కొన‌సాగుతార‌ని అరుణ్ పాండే అభిప్రాయం వ్య‌క్తం చేశారు.