అచ్చంపేట నియోజకవర్గంలో..కాంగ్రెస్ లోకి ఎంపీపీ, జడ్పీటీసీలు

అచ్చంపేట, వెలుగు : అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్  పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. బల్మూర్ ఎంపీపీ అరుణతో పాటు జడ్పీటీసీ లక్ష్మమ్మ, లింగాల జడ్పీటీసీ నేజమ్మ, బల్మూరు మండల బీఆర్ఎస్  పార్టీ మాజీ అధ్యక్షుడు చుక్కారెడ్డి, నరసింహ తదితరులు సోమవారం రాత్రి హైదరాబాద్​లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే వంశీకృష్ణ సమక్షంలో కాంగ్రెస్  పార్టీలో చేరారు.

నల్లమల ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్​ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్  నేతలు వెంకట్ రెడ్డి, గిరివర్ధన్ గౌడ్ ఉన్నారు.