న్యూఢిల్లీ: జూన్లో జరిగే ఎంపీసీ మీటింగ్లో మరోసారి వడ్డీ రేట్ల పెంపు ఉంటుందనే సంకేతాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇచ్చారు. వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని ఎవరైనా అంచనావేస్తారని, ఎంత ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేనని దాస్ ఓ టీవీ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. రెపో రేటు 5.15 శాతానికి పెరుగుతుందని కచ్చితంగాచెప్పలేనని అన్నారు. ఆర్బీఐ ఎంపీసీ వచ్చే నెల 6–8 మధ్య జరగనుంది. ఇన్ఫ్లేషన్ను కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం, ఆర్బీఐ రెండూ కలిసి పనిచేస్తున్నాయని దాస్ అన్నారు. ఇన్ఫ్లేషన్ను కంట్రోల్ చేయడానికి గత 2–3 నెలల్లో ఆర్బీఐ, ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నాయని చెప్పారు.
