అన్న క్యాంటీన్లలో 150 కోట్ల స్కామ్

అన్న క్యాంటీన్లలో 150 కోట్ల స్కామ్

విజయసాయిరెడ్డి ఆరోపణ

అమరావతి, వెలుగు: ఏపీలో అన్న క్యాంటీన్లలో 150 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రజలను ప్రలోభ పెట్టేందుకు చంద్రబాబు సర్కారు వీటిని ఏర్పాటు చేసిందన్నారు. తక్కువ ధరకు పేదలకు అన్నం పెట్టే స్కీమ్ లోనూ దోచుకున్నారని మండిపడ్డారు. రెండు లక్షలతో నిర్మించే క్యాంటీన్ కు 30 లక్షల నుంచి 40 లక్షలు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపారన్నారు. అన్న క్యాంటీన్లపై టీడీపీ విమర్శలకు జవాబుగా శుక్రవారం ట్వీట్ చేశారు.