చంద్రబాబు.. నిన్ను మళ్ళీ జైలుకు పంపిస్తాం..గుర్తు పెట్టుకో : విజయసాయి రెడ్డి

సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. చంద్రబాబు 64 ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించారని.. కేవీ రావు, చంద్రబాబు కలిసి కుట్రలు చేస్తున్నారని అన్నారు. తమపై ఆరోపణలు చేసే బదులు సీబీఐ విచారణ చేయచ్చు కదా అని అన్నారు. చంద్రబాబుకు మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదని అన్నారు. చంద్రబాబు మళ్ళీ జైలుకెళ్ళక తప్పదని అన్నారు విజయసాయి రెడ్డి. 

అందరినీ క్రిమినల్ అంటాడు కానీ.. చంద్రబాబే పెద్ద క్రిమినల్ అని అన్నారు. బ్యాక్ డోర్ ద్వారా కేవీ రావును సీఎండీ చేసారని.. 1997 నుండి ఇప్పటిదాకా జరిగిన ట్రాన్సక్షన్స్ పై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. కేవీ రావు ఒక బ్రోకర్ అని.. చంద్రబాబుకు చెంచా అని అన్నారు. ప్రజలను మభ్యపెట్టడమే ధ్యేయంగా చంద్రబాబు పాలన సాగుతోందని మండిపడ్డారు విజయసాయి రెడ్డి. 

చంద్రబాబుకు అడ్మినిస్ట్రేషన్ తెలియదని.. నారా లోకేష్ నాయకత్వానికి కూడా పనికిరాడని.. తెలుగుదేశం నేతలు నాయకుడిని మార్చుకోవాలని అన్నారు. తండ్రీకొడుకులు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని.. సీఎంను మార్చుకోవాలని కూటమి నేతలకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు విజయసాయి రెడ్డి. చంద్రబాబు కబంధ హస్తాల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలని అన్నారు. రాష్ట్రంలో ప్రతిఒక్కరు అభద్రతా భావంలో ఉన్నారని అన్నారు.