బైపాస్ రోడ్డు నిర్మాణంపై వాస్తవాలు చెప్పాలి : ఎంపీ రఘునందన్ రావు

మెదక్ టౌన్, వెలుగు : రామాయంపేట, బైపాస్ రోడ్డు నిర్మాణంలో భూనిర్వాసితుల అనుమానాలు నివృత్తి చేసి వాస్తవాలను చెప్పాలని ఎంపీ రఘునందన్ రావు అధికారులకు సూచించారు. శుక్రవారం మెదక్​కలెక్టరేట్​లో భూ నిర్వాసితులు, ఎమ్మెల్యే రోహిత్ రావు, కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్  కలెక్టర్ నగేశ్, నేషనల్ హైవే ఈఈ బలరామకృష్ణతో కలిసి సమావేశం  నిర్వహించారు. ఈ సందర్భంగా భూనిర్వాసితుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ  మాట్లాడుతూ రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో 2.65 కిలోమీటర్ల బైపాస్ రోడ్డు నిర్మాణానికి రైతులు సహకరించాలన్నారు. 

ఈ రోడ్డు విషయంలో ఏర్పడిన సమస్యలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. కలెక్టర్ రాహుల్​ రాజ్​ మాట్లాడుతూ.. నిర్వాసితులకు రిజిస్ట్రేషన్ ధరలకు అనుగుణంగా  పరిహారం అదే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ..నిర్వాసితుల సమస్యలను తెలుసుకుని న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి, నేషనల్ హైవే డీఈ అన్నయ్య, ఏఈ మురళీకృష్ణ, తహసీల్దార్ రజిని, భూనిర్వాసితులు పాల్గొన్నారు.