స్టూడెంట్స్ ​చేతుల్లోనే దేశ భవిష్యత్ : ఎంపీ రఘునందన్​ రావు

  • ఎంపీ రఘునందన్​ రావు

రామచంద్రాపురం, వెలుగు: స్టూడెంట్స్ మీదనే ​దేశ భవిష్యత్​ఆధారపడి ఉందని ఎంపీ రఘునందన్​రావు అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం జీహెచ్​ఎంసీ డివిజన్​ పరిధిలో కొత్తగా నిర్మించిన గవర్నమెంట్​స్కూల్​భవనాన్ని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. స్టూడెంట్​దశలో ఉన్న ప్రతీ బాలికకు స్వీయ రక్షణపై శిక్షణ అందించాలన్నారు. దేశ భవిష్యత్​ తరగతి గది గోడల మధ్య నిర్మితమవుతుందన్న వివేకనంద సూక్తికి అనుగుణంగా స్టూడెంట్స్​ను తీర్చిదిద్దాలని టీచర్లకు సూచించారు.

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. స్టూడెంట్స్​చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, అన్ని రకాల క్రీడాకారులకు సహకారం అందించి పటాన్​చెరును స్పోర్ట్స్​హబ్​గా తయారు చేస్తున్నామని చెప్పారు. కొత్త స్కూల్​నిర్మాణానికి మన ఊరు మన బడి నిధులతో పాటు జీవీఆర్​ఎంటర్​ప్రైజెస్​ ద్వారా రూ. 40 లక్షలు కేటాయించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జీహెచ్​ఎంసీ కార్పొరేటర్లు పుష్ప, సింధూ, డిప్యూటీ కమిషనర్​సురేశ్, పంచాయతీరాజ్​ డీఈ సురేశ్, ఎంఈవో రాథోడ్​, నగేశ్​యాదవ్, పరమేశ్, ఐలేశ్
 పాల్గొన్నారు.