అమృత్ పథకంతో తాగునీటి సమస్యకు చెక్ : ఎంపీ డీకే అరుణ 

 కోస్గి,  వెలుగు: కోస్గి మున్సిపాలి  తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అమృత్ 2.0 పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు.  మంగళవారం కోస్గి పట్టణంలోని 7వ వార్డులో రూ12.53 కోట్ల వ్యయంతో చేపట్టిన పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అరుణ మాట్లాడుతూ..  కేంద్ర ప్రభుత్వం ప్రధాని  మోదీ నేతృత్వంలో పట్టణాలే కాకుండా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయల నిధులను అందిస్తోందన్నారు.

రాష్ట్ర పోలీసు గృహనిర్మాణ సంస్థ చైర్మన్ ఆర్. గురునాథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి ఎనుముల తిరుపతిరెడ్డి, ఆర్డీఓ రాంచందర్, కాడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, తహసీల్దార్ బి. శ్రీనివాసులు, కమిషనర్ నాగరాజు, ఏఈ విజయభాస్కర్ రెడ్డి,  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్, పురపాలక చైర్ పర్సన్ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

మద్దూరు,  వెలుగు: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే ప్రభుత్వం పల్లె దవాఖాన్లు ఏర్పాటు చేస్తోందని మహబూబ్ నగర్ ఎంపీ  డీకే అరుణ, కాంగ్రెస్ పార్టీ కొడంగల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి తిరుపతి రెడ్డి అన్నారు.  మంగళవారం మద్దూరు మండలంలోని జాదవ రావ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి,  రేణివట్లలో రూ. 22 లక్షల తో నిర్మించిన పల్లె దవాఖాన్లను ప్రారంభించారు.  ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ..  259 గ్రామ పంచాయతీలలో 59 పల్లె దవాఖానాలు అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు.