కేంద్ర ప్రభుత్వ స్కీములను సద్వినియోగం చేసుకోవాలి : ఎంపీ డీకే అరుణ

గద్వాల, వెలుగు:  కేంద్ర ప్రభుత్వ స్కీంలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ కోరారు. మంగళవారం గద్వాల జిల్లా కేంద్రంలో  పీఎం విశ్వకర్మ యోజన టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  విశ్వకర్మ యోజన శిక్షణ తీసుకున్న వారికి డిజిటల్ ఐడీ, విశ్వకర్మ డిజిటల్ శిక్షణ సర్టిఫికెట్ ఇస్తామన్నారు.

 దాదాపు 18 రకాల చేతివృత్తుల వారికి లబ్ధి చేకూరుతుందన్నారు. శిక్షణ తీసుకున్న వారికి 1500 రూపాయల విలువ చేసే టూల్ కిట్‌తో పాటు ఏడు రోజుల శిక్షణ కాలానికి సంబంధించి ప్రతిరోజు రూ. 500 చొప్పున రూ. 3500 ఇస్తామన్నారు. ప్రాచీన హస్తకళలను, చేతి వృత్తులను కాపాడుకునేందుకు విశ్వకర్మ యోజన ఎంతగానో పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో రామచంద్రారెడ్డి, రామాంజనేయులు, బండల వెంకట్ రాములు, శివారెడ్డి, దాస్, రజక జయశ్రీ, చిత్తరి కిరణ్ పాల్గొన్నారు.