ట్రక్ డ్రైవర్లను తిట్టినందుకు కలెక్టర్పై వేటు

ట్రక్ డ్రైవర్లను తిట్టినందుకు కలెక్టర్పై వేటు

మధ్య ప్రదేశ్ లో ట్రక్ డ్రైవర్లను అసభ్య పదజాలంతో తిట్టినందుకు ఓ కలెక్టర్ ను సస్పెండ్ చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్. ట్రక్ డ్రైవర్ల నిరసనతో చర్చలకోసం జరిగిన సమావేశంలో షాజాపూర్  కలెక్టర్ కిషోర్ కన్యాల్.. ట్రక్ డ్రైవర్లను తీవ్ర పదజాలంతో తిట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఇలాంటి భాషను మేం సహించబోమని హెచ్చరించారు. 

షాజాపూర్ కలెక్టర్  కిషోర్ కన్యాల్ ను రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. షాజాపూర్ కొత్త కలెక్టర్ గా నర్సింగ్ పూర్ కలెక్టర్ రిజు బఫ్నాను నియమించారు. ఈ విషయాన్ని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపారు. 

ఏం జరిగిందంటే.. 

మంగళవారం ( జనవరి 2)  ఓ డ్రైవర్ల సంఘం ప్రతినిధులతో జరిగిన సమావేశంలో కిషోర్ కన్యాల్  వారితో తీవ్ర పదజాలంతో దురుసుగా ప్రవర్తించారు. డ్రైవర్ల ప్రతినిధి మీరు మంచిగా మాట్లాడండి అని ప్రశ్నించినప్పుడు.. నవ్వు నన్నేం చేయగలవు.. నీ తాకత్ ఏమిటి అన్నట్తుగా.. హిందీలో క్యా కరేగే తుమ్.. క్యా ఔకత్ హై తుమ్హారీ అని కన్వల్ ప్రతినిధిని బెదిరిస్తూ మాట్లాడాడు. తర్వాత తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి అన్నట్లు గా విచారణ వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబందించి వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయింది. 

ఈ ఎపిసోడ్ తెలిసిన సీఎం మోహన్ యాదవ్.. అధికారు దురుసుతనం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ నాయకత్వంలో పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నాం.. ఎంత పెద్ద అధికారి అయినా పేదల పనిని , మనోభావాలను గౌరవించాలి. ఒక మనిషిగా మా ప్రభుత్వంలో ఇలాంటి భాష సహించం అన్నారు మోహన్ యాదవ్. కిషోర్ కన్వల్ ఇకనైనా అలాంటి ప్రవర్తనను మార్చుకోవాలన్నారు.