అల్లు అర్జున్ ప్రభుత్వాన్నిబద్నాం చేయాలనుకుండు: ఎంపీ చామల కిరణ్

 సినిమా  ఇండస్ట్రీపై ప్రభుత్వానికి ఎటువంటి కక్షసాధింపు లేదన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.   సంధ్య థియటేర్ ఇష్యూను రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.  ఈ ఇష్యూను  బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయానికి వాడుకుంటోందన్నారు.  ఎప్పుడో సద్గుమణిగే వివాదాన్ని ఇంకా రాజేస్తున్నారని మండిపడ్డారు.  పొలిటికల్ మైలేజ్ కోసం కొందరు రాజకీయ నాయకులు పుష్ఫ వివాదంపై  అనవసరంగా ప్రెస్ మీట్ లు పెడుతున్నారని చెప్పారు.  

పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్  తో  తమకు ఎలాంటి వైరం లేదన్నారు.  రేవంత్ కు  సినిమా ఇండస్ట్రీపై ద్వేషం లేదని  చెప్పారు.  అల్లు అర్జున్ బాధ్యత లేకుండా వ్యవహరించడం వల్లే సంధ్య థియేటర్ ఘటన జరిగిందన్నారు. అల్లు అర్జున్  ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి  ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు ఎంపీ కిరణ్ . 

Also Read :- అల్లు అర్జున్ మామకు చేదు అనుభవం

 సినిమా ఇండస్ట్రీ  సమస్యలు పరిష్కరించాలనే  దిల్ రాజుకు కార్పొరేషన్ పదవి ఇచ్చామన్నారు ఎంపీ చామల.  దిల్ రాజ్ ఇండస్ట్రీ వ్యక్తి.. ఇండస్ట్రీ,  ప్రభుత్వానికి మధ్య జరిగిన డ్యామేజ్ ను కంట్రోల్ చేసే బాధ్యత దిల్ రాజ్  తీసుకుంటారన్నారు.  కాంగ్రెస్ హయాంలోనే ఇండస్ట్రీ అభివృద్ధి చెందిందన్నారు.  అందరు బాగుండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు.